పండుగ పెళ్లిళ్లు వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించాలి అంటే దేశవ్యాప్తంగా పేరున్న పైథాని చీరలను ఎంచుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. భారీ జెర్రీ బోర్డర్ తో ప్రత్యేకమైన డిజైన్లతో ఉండే పైథాని చీరను, నూలు అద్దకం నుంచి అల్లిక వరకు పూర్తిగా చేత్తోనే చేస్తారు. నెమల్ల వరస అల్లికలో ఉండే చీరలు బంగడి మోర్ అని, పూజలు, వ్రతాల్లో వాడుకునే ఏకధోతి వీల్ శారీస్, బ్రోకెడ్ బార్డర్ లో ఉండే బ్రోకెడ్ పైథాని చిలకల అల్లికలతో మునియా బ్రోకేడ్ పైథాని చీరలు భారీ వేడుకల కోసం ఎంచుకోవాలి. పైథాని చీరల్లో ఎరుపు అంచు ఉండే నలుపు చీర, (చంద్రకళ) చిలకాకు పచ్చ (రఘు) తెల్లచీర (శిరోడర్) ప్రత్యేకంగా సాంప్రదాయ రంగులంటే ఈ మూడు రంగులనే చెప్పాలి మరాఠీ  పెళ్లిళ్ల లో మెరిసే ఈ చీరలు ఇప్పుడు దక్షిణాది పెళ్లిళ్ల లో కూడా కనిపిస్తున్నాయి.

Leave a comment