భారతదేశానికి చెందిన నేత కళ అమూల్యమైన సంప్రదాయాన్ని ఔన్నాత్యాన్ని చాటి చెపుతోంది. బనారస్ చీరె పట్టు దారాల అల్లికతో బంగారు తీగల తారళ్యంతో బనారస్ జరీ చీరె మిలమిల లతో రాజరికపు సౌందర్యాన్ని ప్రతి ఫలిస్తుంది.ఈ నేత పని చేసే నిపుణులు సంప్రదాయమైన రంగుల అద్దకం లోనూ ,జనాదరాణ పొందిన రసాయన వర్ణాలు ఉపయోగించటంలోనూ చాలా శ్రద్దగా ఉంటారు. వివాహా సందర్భంలో బెనారస్ చీరె గొప్ప ఎంపిక .వీటికి ఎంచుకొనే రంగులు ప్రత్యేకమే ప్రేమకు సంకేతంగా ఎరుపు రంగు, కృష్ణుని గుర్తు తెచ్చే నీలి రంగు శుభానికి శాంతికి సంకేతమైన తెలుపు వ్యక్తుల భావోద్వేగాలను విళితం చేసి ఎంచుకొన్నట్లు ఉంటాయి. జీవితంలో వచ్చే ప్రత్యేక క్షణాల కోసం బెనారస్ జరీ చీరెలు ఎంచుకొంటారు.

Leave a comment