Categories
Nemalika

సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి.

నీహారికా,

భోజనానికి, ఆరోగ్యానికి, జీవనశైలికి, ఆరోగ్యానికి సంబందం ఏమిటన్నావు. జీవన శైలి లోనే టాక్సిక్ పదార్ధాలు తినడం వత్తిడి తో పని చేయడం, సరైన వేళలు ఏ విషయంలోనూ పాటించకపోవడం మొదటి అనర్ధం. అలాగే టాక్సిక్ పదార్ధాలు లేని ఆహారాన్ని తింటామా? కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్ లీన్ ప్రోటీన్లు అత్యవసరమైన ఫ్యట్స్ విటమిన్లు నీరు వంటి పోషకాలు సక్రమంగా అందే ఆహారం తినాలి. పరిసుద్దమైన గాలి స్వచ్చమైన నీరు సూర్యకిరణాలు కూడా కావాలి. వ్యాయామం చేయాలి. విశ్రాంతి కావాలి. ఆరోగ్యంగా వుండటం అంటే రుగ్మతలు లేకుండా వుండటం మాత్రం కాదు. శరీరం చురుకుగా పూర్తి స్ధాయి ఆరోగ్యంతో వుండటం ఆశావహంగా ముందుకు సాగడం ఇప్పుడు చూడు, పుష్టి కరమైన, ఆరోగ్యవంతమైన ఆహారంతో శరీరానికి ఆరోగ్యం కలిగితే నాణ్యత గల జీవన శైలిఆశావహమైన ఆరోగ్యం దక్కుతుంది. ప్రశాంతంగా వుండాలి. దైనందన జీవితం, మితమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. చక్కని అలవాట్లు, వ్యాయామం తో, ఆరోగ్యంగా వుండాలి.

Leave a comment