పర్యావరణం ,పచ్చదనం కాన్సెప్ట్ అందిరికీ చేరినట్లే వీధులూ,ఇళ్ళు పచ్చ పచ్చగా పూలు ,చెట్లతో కళకళలాడుతున్నాయి. చోటు లేదనుకోకుండా ఉన్నా ఇరుకు వాకిట్లోనే రెండు మొక్కలు పెంచాలంటే గ్రో బ్యాగ్స్ కొనుక్కోవచ్చు. రీసైక్లింగ్ చేసిన పలుచని ప్లాస్టిక్ దారాలకు మందంగా ఉన్నా మామూలు దారాలు కలిపి ఈ గ్రో బ్యాగ్స్ చేస్తారు. ఈ సంచి కుండీల్లో రంధ్రాలు ,చక్కగా గాలీ నీరు,వెలుగు మొక్కలకు ఇచ్చి అవి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. రంగురంగులా పూలు ,మీనియేచర్ మొక్కలు ,కూరలు అన్నీ ఈ సంచిలో పెంచవచ్చు.మామూలు బ్యాగ్ లకు లాగా ఈ సంచీలకు తాళ్ళు ఉంటాయి కనుక అటు ఇటూ మార్చుకోవచ్చు.

Leave a comment