ఇప్పుడు ఒకేలాగా లేకుండా ఎదో ఒక కొత్తదనం ఇస్తూనే వుండాలి అంటారు స్టయిలిస్టులు. ఇప్పుడు బ్లావుజుల గురించి చుస్తే ఇవి ఎప్పటి ఫ్యాషనో. కానీ కొన్ని సందర్భాలలో రిసెప్షన్, ఎంగేజ్మెంట్ వంటి వేడుకల్లో వధువు కుడా ఈ తరహాని ప్రయత్నం చేయవచ్చు. అలాగే పెళ్ళిలో బుట్ట చేతులు కొత్త అందం ఇస్తాయి. పెళ్లి పట్టు చీరాల పైకి ఈ బుట్ట చేతులు బరువైన లోలాకులు, భారీ నగలు కలిసి పెల్లికుతురికి ఒక ప్రత్యేకమైన కళ తెస్తాయి. అలాగే భారీ ఎంబ్రాయిడరీ పైతనం వున్నా పొడవాటి గౌన్ల పైకి పల్చని నెటెడ్ వస్త్రంతో కుట్టించిన పొడవు చేతుల కుర్తి బావుంటుంది. అలాగే ఫుల్ క్రెప్, రా సిల్క్ కాటన్, జార్జేట్ చీరాల పైకి పొడవు చేతుల బ్లవుజ్ బావుంటుంది. ఏ సందర్భం అన్నది గుర్తుపెట్టుకుంటే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తేల్చుకోవచ్చు.

Leave a comment