రాళ్ళూ కూడా అరిగేంత గొప్ప గానం ఉంటుందంటారు. కానీ ఏకంగా ఈ శిల సంగీతం పలికిస్తుంది. అజర్ బైజాన్ గోచిస్థాన్ నేషనల్ పార్కులో ఈ సంగీత శిల ఉంది . ఈ పార్కులో చెట్లు,ఆకట్టుకునే కళారూపాలు, పార్కులో అన్ని ఉన్నాయి . వాటితో పాటు గ్వల్ దాష్ గా పిలిచే ఈ సంగీత శిల కూడా ఉంది . నేలపై పడుకున్న భంగిమలో ఉంటుందీ శిల . దాని పైన చిన్న చిన్న రాళ్ళతో కొడితే మధురమైన సంగీతం పలికిస్తాయట. కానీ గ్వాల్ దాష్ వినిపించే సంగీతం చాలా బావుంటుంది. ఈ శిలను చూసేందుకు బోలెడుమంది పర్యాటకులు  ప్రముఖ సంగీత కళా దర్శకులు ఆసక్తి చూపిస్తారట .

Leave a comment