కరోనా వైరస్ ఒక్కటే కాదు నిరంతరం చేతుల్లో ఉండే ఫోన్ పైన టాయిలెట్ సీట్ పైన ఉన్నంత బ్యాక్టీరియా ఉంటుందంటున్నాయి    అధ్యయనాలు.ఈ ఫోన్ శుభ్రం చేసేందుకు శానిటైజర్ వాడితే అందులో ఉండే గాఢత కలిగిన ద్రావకం మూలంగా ఫోన్ పాడయ్యే అవకాశం ఉంది.కొలిన్ వంటి ద్రావకం కొంత నయం.నేరుగా వాటిని ఫోన్ పైన చల్లకుండా మెత్తగా ఉండే మైక్రో ఫైబర్ వస్త్రాన్ని తీసుకొని దాని పైన ద్రావకం చెల్లి ఫోన్ ను సున్నితంగా తుడవాలి.శానిటైజర్ లిక్విడ్ లోపలికి పోతే మదర్ బోర్డ్ పాడయ్యే అవకాశం ఉంటుంది మాస్క్ లు సామాజిక దూరం తో పాటు ఇప్పుడు చేతిలో ఉండే ఫోన్ ఈ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి.

Leave a comment