శరీరం ఇచ్చే సంకేతాలు గుర్తించండి . ఏ చిన్ని ఇబ్బంది కైనా శరీరం వెంటనే స్పందిస్తుంది. మెదడుకు సంకేతం అంటుంది . హాయిగా ఓ ఎనిమిది గంటలు నిద్రపోయి ,ఆహారం తీసుకొన్న తర్వాత కూడా అలసటగా అనిపిస్తే వెంటనే రక్తపోటు ,విటమిన్ల స్థాయి పరీక్ష చేయించుకోవాలి. తరచుగా తలనొప్పి రావటం కూడా మంచి సంకేతం కాదు . హఠాత్తుగా తలపోటు వస్తే రక్తపోటు ,రక్తంలోని చక్కెరల స్థాయి కారణం కావచ్చు అలాగే ఏ కారణం లేకుండా కండరాల నొప్పి అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి . అలాగే వెన్నునొప్పి కూడా శరీరం ఇచ్చే అనారోగ్య సంకేతమే . ఒత్తిడి అనో ,నిద్రలేక అనో అశ్రద్ధ చేయకుండా డాక్టర్లును కలవమంటున్నారు

Leave a comment