Categories
సంక్రాంతి వచ్చిందీ అంటే గుమ్మం ముందు వేసిన ముగ్గులే అవునంటాయి . ఈ ముగ్గులు ఇంటిముందు అలంకారం కోసమే కాదు చక్కని చీరెల పైకి కూడా బావుంటాయి . ఆకర్షణీయమైన ముగ్గు డిజైన్ లతో మాములు కాటన్ చీరెలు దగ్గర నుంచి ఖరీదైన పట్టు పైదనీ చీరెలు కూడా వచ్చాయి . ప్లయిన్ కాటన్ చీరె అంచుల్లో చక్కని అందమైన ముగ్గులతో అచ్చంగా పండగ కోసం డిజైన్ చేసినట్లే ఉంటాయి . అలాగే చక్కని పట్టు చీరెకు బ్లౌజు కు మెడచుట్టు సన్నని దారంతో ముగ్గుని ఎంబ్రాయిడరీ చేస్తే చీరె అందం రెండింతలు అవుతుంది . చేతికొట్టు తో రకరకాల డిజైన్ లకు అందంగా ముగ్గులు కుట్టిన బ్లౌజ్ లు ఆన్ లైన్ లో ఇమేజెస్ లో చూడచ్చు .