సంక్రాంతిని పెద్ద పండగ అని, రైతుల పండగ అని అంటారు. సంక్రాంతి సమయంలో తోలి పంట ఇంటికి వస్తుంది. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ మనకు ఇంకా ఎం వుంటుంది. అందుకే శ్రమకు సంపాదకు గప్ప స్థానం ఇచ్చే సంక్రాంతి ని పెద్ద పండుగ అంటారు. హేమంతంలో సూర్యుడు భూమికి దూరంగా వుంటాడు. కనుక వాతావరణం చల్లగా వుండి క్రిమి కీటకాలు స్వేచ్చ గా సంచరించి అంటూ వ్యాధులు సోకే అవకాసం వుంటుంది. అందుకే ఈ మాసంలో ఇంటి ముంగిల్లల్లో పేడ నీళ్ళు జల్లి గుల్ల సున్నం తో ముగ్గులేస్తారు. ముగ్గులోని కాల్షియం క్రిమి కీటకాలను సంహారానికి తోడ్పడుతుంది. ఆవు పేడతో కళ్ళపు  జల్లడం వాళ్ళ అందులోని రేడియానికి గల రోగ  సంహారణ శక్తి ఈ ఋతువులో వచ్చే కొన్ని క్రీములు నశిస్తాయి. అందుకే సంక్రాంతి ని ముగ్గుల పండగ అంటారు.

Leave a comment