కొందరు ఇంటికి రాగానే వార్తల్లో పడిపోతారు. నిమిష  నిమిషం ప్రపంచపు నలుమూలల ఏం  జరుగుతుందో తెలుసుకోవటం నూటికి 86 మంది చేసేపని. ఇది తప్పేంకాదు కానీ . ఆ వార్తల్లో టెన్షన్ తెచ్చే క్రీడలు ఆర్ధిక సంక్షోభాలు ప్రమాదాలు మరణాలు ఇలాంటివి రాత్రివేళ చూసి పడుకుంటే అది మెదడు కు విశ్రాంతి లేకుండా చేసి ఉదయం లేచేసరికి ఆందోళనగా ఉంటుంది. ఈ టెన్షన్ తో ఎదో ఒకటి అతిగా తినేస్తారని ఇది శరీరానికి అత్యధిక క్యాలరీలను మోస్తుందనీ డాక్టర్లు చెపుతున్నారు. కఠినమైన ప్రపంచంలో జీవిస్తున్నామన్న భావం మనుషుల్లో తెలియకుండానే కలుగుతుంది. వనరుల కొరత వస్తుందని ఆర్ధిక సంక్షోభం వస్తుందని మెదడు గుర్తించటంతో మనసు చిరుతిండ్ల వైపు లాగుతోందిట  అంచేత వార్తల్లోనుంచి కాస్త బయటకు వచ్చి శాంతిగా ఓ సంగీతం వినటమే పుస్తకం  చదవటమో  చేయాలి.

Leave a comment