సనా మిరెలా మారిన్ 34 సంవత్సరాల వయసులోనే ఫిన్లాండ్ ప్రధాన పీఠాన్ని అధిరోహించారు.కాలేజీ రోజుల్లోనే రాజకీయాల్లో కి  ప్రవేశించారు సనా.సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఫిన్లాండ్ యువ విభాగమైన సోషల్ డెమోక్రటిక్ యూత్ తో పని చేశారు.2015లో ఎంపీగా పోటీ చేసి నెగ్గారు.2019 లో ట్రాన్స్ పోర్ట్ కమ్యూనికేషన్స్ మంత్రి అయ్యారు.ఆ ఏడాదే ప్రధానిగా పీఠం దక్కించుకున్నారు.ఫుట్ బాల్ ప్లేయర్ మార్కస్ రైక్కొనెన్ ఆమె భర్త సమాజంలో అందరూ సమానమే అంటారు సనా మిరెలా మారిన్ మహిళా ఉద్యోగులతో సమానంగా వెటర్నిటీ లీవ్ వ్యవధిని పెంచారమె.

Leave a comment