ఈ మధ్య కాలంలో లెట్  పెళ్ళిళ్ళ వల్ల, లేదా కెరీర్ ప్లాన్స్ కోసం గర్భధారణ ఆలస్యం అవ్వుతుంది. 30 ఏళ్ళు వచ్చే దాకా గర్భం ధరించడం గురించి ఆలోచించకుండా అప్పుడు బిడ్డల్ని కనాలి అనుకున్నా లేట్ అవ్వుతూ వుంటుంది. డాక్టర్ల సలహా తీసుకుంటారు కరక్టే గానీ దీనికి కారణం వత్తిడి కుడా కావచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒత్తిడి గనుక వుంటే దాని ప్రభావం గర్భధారణ కు సంబందించిన అవకాశాల పై సీరియస్ గా ఉంటుందని ఒక వేల వత్తిడి కారణం గానే గర్భాదారణ ఆలస్యం కావచ్చు అని కొన్ని అద్యాయినాల్లో గుర్తించారు. ఒత్తిడి ఇన్ ఫెర్టిలిటీకి కారణం కావచ్చునంటున్నారు. ఒత్తిడి స్ధాయిల పట్ల తప్పని సరిగా ఎటెన్షన్ పెట్టమంటున్నారు. అప్పుడే ఆరోగ్యం మేరుగావ్వుతుంది. గర్భం ధరించే అవకాశాలు కుడా మెరుగవ్వుతాయి.

Leave a comment