కోపం అన్నీ  అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో ఏర్పడ్డ గాయాలు తొందరగా మానక పోవటానికి కోసం ఒక ముఖ్య కారణం అని ఇటీవల పరిశోధనలు చెపుతున్నాయి. కోపం ఎక్కువైతే కార్టిసోల్ హార్మోన్ విడుదల అవుతాయి. ఇవి పుండ్లు ,గాయాలు మానకుండా చేస్తాయట. మామూలు స్థాయి కంటే ఎక్కువ కోపం వున్నవాళ్లకే ఈ ప్రాబ్లమ్. కాలిన గాయాలతో బాధపడుతున్న 300 మందికి పైన పరిశోధనలు నిర్వహించి ఈ విషయం గుర్తించారు. వారిలో అకారణంగా ఉద్రేక పడేవారిలో గాయాలు మానేందుకు ఇరవై రోజులు సమయం పడితే శాంతంగా వుండేవాళ్ళలో నాలుగైదు రోజుల్లోనే గాయాలు మానటం ప్రారంభించాయట. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటే ఒక గాయాలే కాదు ఇంకేమన్నా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండచ్చు అంటునాన్రు పరిశోధకులు. ఈ కోపం వల్లనే నాడీ  వ్యవస్థ పై శ్రీఘ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. ఈసారి కోపం వచ్చినప్పుడు గమనించండి. తీవ్రమైన కోపం వస్తే వళ్ళు  వణికి పోతుంది. పల్స్ రేట్ అధికంగా వుంటుంది. కోపం కొంచెం అదుపులో ఉంచుకోవటం ఉత్తమం అంటున్నారు పరిశోధకులు.

Leave a comment