దేశ భక్తుడి ని కన్నా అదృష్టం నాది. కొడుకు చని పోయాడని బాధగా ఉన్న దేశ రక్షణ కోసం,నా కొడుకు ప్రాణాలు వదలటం నాకు దక్కిన ఓదార్పు అంటున్నారు,గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ లో అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తల్లి బిక్కు మళ్ల మంజుల దేశానికి సేవ చేసే భాగ్యం అందరికీ రాదనేవాడు సంతోష్. ఐదో తరగతి వరకు సూర్యాపేటలో చదువు కొన్నాడు. ఆరు నుంచి కోరుకొండ సైనిక్ స్కూలు ఆ తర్వాత ఎన్ డిఏ లో చదువు కొన్నాడు. సైన్యంలో చేరాలనే కోరిక తండ్రి నుంచి వచ్చింది. ఎదిగిన కొద్ది దేశానికి సేవ చేయాలని కోరిక వారి నరనారలా జీర్ణించుకుపోయింది. సామజిక సమస్యల కుటుంబ బంధాల విషయంలో చాలా సున్నితమైన వాడు ఏడాదిన్నరగా చైనా సరిహద్దుల్లో ఉన్నాడు. ఇక్కడ ప్రమాదం తక్కువ అనుకొన్న కానీ ఇలా నాకు శాశ్వతంగా దూరమై పోతాడును కోలేదు అంటోంది కన్నీటి సముద్రంగా మారిపోయిన మంజుల. ఆమె ధన్యురాలు. ఒక సైనికుడి తల్లి.

Leave a comment