Categories
Nemalika

సంతోషం కూడా బాడీ లాంగ్వేజ్ లాంటిదే.

నీహారికా,

మనచూత్తో ఉండే స్నేహితులను బట్టి మన వ్యక్తిత్వాన్ని బిర్నయిస్తారనే మాటలో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ మన చూట్టూ సంతోషంగా, అనుకూల దృక్పథం లో ఉంటె మనమూ సంతోషంగా ఉంటామని పెద్దవాళ్ళు చెపుతున్నారు. ఆభాయులు పరిసరాల్లోకి ప్రసరిస్తాయి. నవ్వు, ఆనందం సాధారణ సంతోషం చాలా తొందరగా చుట్టూ విస్తరిస్తుంది. సంతోషం ఒకరి నుంచి ఒకరికి పాకటం సాధారణ విషయం అయితే కాదు అందరు మనుషుల్లో చాలా శక్తి ఉండాలి. ఒక సమూహంలోకి ఒక మాటకారి అయిన వాళ్ళు కానీ, బాగా నవ్వించే వాళ్ళు గానీ వచ్చి చేరితే ఆకబుర్లు చెప్పే  లక్షణం ఎదుటివాళ్ళతో నవ్వించే లక్షణం ఆ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ముందుగా అనేక మంది మద్యన ఓ చైతన్యం వస్తుంది. ఒకరికి తెలియకుండా ఒకరికి  దృడమైన విశేషాలు చేరతాయి. ఇది సంతోషంగా ఉండటం ఒక బాడీ లాంగ్వేజ్ లాంటిదే. ఒకరి నుంచి ఒకరికి అంటుతుంది. ఇంకొకరు కూడా ఈ బాడీ లాంగ్వేజ్ ను తమకు అన్వయించుకొని పెదవులపైన నవ్వులు పూయిస్తారు. అందరి మద్య ఉండేది అప్పుడు కేవలం సంతోషం మాత్రమే.

Leave a comment