నీహారికా, ఎల్లవేళలా చెదరని చిరునవ్వుతో వుండాలంటే ఏం చేయాలి అన్నావు. సరిగ్గా చెప్పాలంటే నవ్వు అనేది కేవలం ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ మాత్రమే.ఇది హృదయానికి కిటికీ లాంటిది. మనం నవ్వినప్పుడు ఎండార్ఫిన్లుగా పిలవబడే న్యురోట్రాన్స్ మీటర్స్ విడుదలై సంతోషాన్ని ఇస్తాయి. ఒత్తిడి స్థాయిల్ని తగ్గిస్తాయి. సరదాగా వుండే అన్నింటి వైపు దృష్టి సారించడమే. మనం చుసేవే మన మనసు-ని ప్రభావితం చేస్తాయి. కామెడీ షోలు,ఫన్నీ వీడియోలు, కామిక్ స్ట్రిప్స్ వంటి తక్షణ సరదాలు జీవితం లోకి తెచ్చుకోవాలి. ఇష్టపడే వారితో కలిసి గడపటం వల్ల పూర్తి స్థాయి ఆరోగ్యం, సంతోషం దక్కుతాయని అనేక పరిశోధనలు పేర్కొంటున్నాయి. అలాగే పెంపుడు జంతువులు కూడా సంతోషాన్ని అందిస్తాయి. వీటివల్ల ఆటోమేటిక్ గా మంచి మూడ్ వస్తుంది. అలాగే ఒక మంచి పని చేయడం వల్ల కూడా తక్షణ ఆనందం దక్కుతుంది. ఇతరుల కోసం చేసే ప్రతి పనిలోనూ మన సహాయం అందుకొన్న వారి మొహంలో కనిపించే ఒక మంచి చిరునవ్వు మన మూడ్ ని సంతోషంగా మార్చేస్తాయి. మనం సంతోషంగా వుండటం అంటే చుట్టూ సంతోషాన్ని సృష్టించుకోవడం అన్నమాట. సంతోషం చాక్లెట్ లాగా దొరకదు. మన మనసు చేసే అద్భుతం సంతోషం. దాన్ని ఎప్పుడూ ఇతరులకు అందిస్తూపోవడం మనం పొందే సంతోషం. అప్పుడే మనం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాం.
Categories
Nemalika

సంతోషం మనం సృష్టించే అద్భుతమే

నీహారికా,

ఎల్లవేళలా చెదరని చిరునవ్వుతో వుండాలంటే ఏం చేయాలి అన్నావు. సరిగ్గా చెప్పాలంటే నవ్వు అనేది కేవలం ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ మాత్రమే.ఇది హృదయానికి కిటికీ లాంటిది. మనం నవ్వినప్పుడు ఎండార్ఫిన్లుగా పిలవబడే న్యురోట్రాన్స్ మీటర్స్ విడుదలై సంతోషాన్ని ఇస్తాయి. ఒత్తిడి స్థాయిల్ని తగ్గిస్తాయి. సరదాగా వుండే అన్నింటి వైపు దృష్టి సారించడమే. మనం చుసేవే మన మనసు-ని ప్రభావితం చేస్తాయి. కామెడీ షోలు,ఫన్నీ వీడియోలు, కామిక్ స్ట్రిప్స్ వంటి తక్షణ సరదాలు జీవితం లోకి తెచ్చుకోవాలి. ఇష్టపడే వారితో కలిసి గడపటం వల్ల పూర్తి స్థాయి ఆరోగ్యం, సంతోషం దక్కుతాయని అనేక పరిశోధనలు పేర్కొంటున్నాయి. అలాగే పెంపుడు జంతువులు కూడా సంతోషాన్ని అందిస్తాయి. వీటివల్ల ఆటోమేటిక్ గా మంచి మూడ్ వస్తుంది. అలాగే ఒక మంచి పని చేయడం వల్ల కూడా తక్షణ ఆనందం దక్కుతుంది. ఇతరుల కోసం చేసే ప్రతి పనిలోనూ మన సహాయం అందుకొన్న వారి మొహంలో కనిపించే ఒక మంచి చిరునవ్వు మన మూడ్ ని సంతోషంగా మార్చేస్తాయి. మనం సంతోషంగా వుండటం అంటే చుట్టూ సంతోషాన్ని సృష్టించుకోవడం అన్నమాట. సంతోషం చాక్లెట్ లాగా దొరకదు. మన మనసు చేసే అద్భుతం సంతోషం. దాన్ని ఎప్పుడూ ఇతరులకు అందిస్తూపోవడం మనం పొందే సంతోషం. అప్పుడే మనం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాం.

Leave a comment