మనం విశ్రాంతి తీసుకుంటున్నా మెదడు పనిచేస్తూనే వుంటుంది. మెదడు పని చేయాలంటే ఎంతో ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ గ్లూకోజ్ రూపంలో అవసరం అవుతుంది. ఇది రక్త నాళాల ద్వారా రక్తం లో సరఫరా అవుతుంది. మెదడు స్వయంగా గ్లూకోజ్ తయ్యారు చేసుకోలేదు కాబట్టి నిరంతరం రక్తం ద్వారా గ్లూకోజ్ సరఫరా అవుతూ ఉండాల్సిందే. నిద్ర పోయేటప్పుడు కుడా మెదడు పనిచేస్తుంది. కాబట్టి మెదడులోని న్యురాన్లు పరస్పరం అనుసంధానించు కుంటూ ఉంటాయి కాబట్టి న్యూరో ట్రాన్స్ మీటర్ల ఉత్పత్తి కి కుడా గ్లూకోజ్ అవసరం అంటే బ్రెయిన్ పవర్ దాని కందే గ్లూకోజ్ పైనే ఆధారపడి వుంటుంది. మనిషి సంతోషం పైన కుడా మెదడు పని తీరు బావుంటుంది. అంటే వత్తిడి లేని జీవితం కావాలన్నమాట. సంతోషం, మంచి నిద్ర పోషకాలు, వ్యాయామం ఇవే బ్రెయిన్ ఎనర్జీకి ఉపయోగపడేవి.

Leave a comment