నిహారిక,

సంతోషం సగం బలం అన్న నానుడి కరక్టేనా అన్నావు. దాని చరిత్ర అనంతరం ఉత్సాహం, కృతజ్ఞత వంటి పాజిటివ్ అంశాలు, ఏమోషన్ లతో ఎప్పుడైతే ఉంటామో అదే సంతోషం. పరిపూర్ణమైన భావాలు వున్నప్పుడు కలిగేది సంతోషం. మంచి జాబ్, జీతం,జీవిత భాగస్వామి, సమృద్దిగా సంపద, చెక్కని సౌష్టవం, మంచి ఆరోగ్యం ఇవన్నీ వుంటే ఆరోగ్యంగా ఉండగలరా అనే, ఇవి సంతోషపు చిరునామా కాదు. జీవితం లోని ప్రతి అంశం పట్ల సానుకూల దృక్పదం వుంటే సంతోషం సాధ్య పడుతుంది. ప్రపంచలో గల రిలేషన్ షిప్స్ కు ప్రపంచాన్ని మనం చూసే ద్రుష్టి కోణానికి సంతోషం ఆత్మబంధువు. సంతోషం అన్నింటిని ఎంజాయ్ చేయమంటుంది. స్నేహంగా, దయగా, కరుణగా వుంటే వారి దగ్గర సంతోషం స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. వాళ్ళ పనిలో, బంధువులతో ఒత్తిడిని తేలికగా ఎదుర్కుంటారు. మనస్సులో ఎలాంటి బరువు, భారం వుండవు కనుక అనారోగ్యాలు కూడా దగ్గరకు రావు ఇప్పుడు అర్ధం చేసుకో సంతోషం పూర్తి స్థాయి బలం.

 

Leave a comment