జైన్ సన్యాసినులు అహింస ప్రచారం చేస్తారు. పాదరక్షలు ధరించరు, నడిచేప్పుడు కీటకాలు ,కాళ్ళ కింద పడి నలగిపోకుండా చూస్తారు. అలాంటి సన్యాసినులు ఇప్పుడు స్వీయరక్షణ పద్దతులు నేర్చుకొంటున్నారు. సూరత్ లోని జీవన కల్యాన్ ట్రస్ట్ అధ్యక్షుడు అశిల్ గాంధీ మహిళలు ఆత్మరక్షణ పద్దతులు నేర్పుకోవటం తప్పు లేదంటున్నారు. 20 ఏళ్ళ జైన సన్యాసిని ఒకామే ఈ స్వీయ రక్షణ పద్దతులు నేర్చుకొవటం గురించి మాట్లాడుతూ ఏ మనుష్యులకు హాని చేయకూడదే మతం మనకు బోధిస్తోంది. కానీ మమ్మల్ని ప్రమాదం లోంచి రక్షించు కోమ్మని కూడా మతమే చెబుతుంది.ఈ శిక్షిణలో మెము మమ్మల్ని ఈ కర్రతోనూ, చేతులు,కాళ్ళతోనూ కాపాడుకొంటాం అంటోంది సూరత్ లోని .జైన సన్యాసినులు ఈ స్వీయరక్షణ పద్దతుల ద్వారా దమకు ఎదురమ్యే లైంగిక దాడులను విజయవంతంగా ఎదుర్కొగలమని భావిస్తున్నాను.

Leave a comment