అమ్మ అయ్యాక బిడ్డకు సరిపోను పాలు ఉండకపోతే తల్లి కష్టమే. కొత్తగా తల్లి అయిన మహిళలు తమ ఆహారంలో పాలు పెరుగు కూరగాయలు పప్పు ధాన్యాలు నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. తల్లి దగ్గర పాలు తాగిన బిడ్డ రెండు మూడు గంటలు నిద్ర పోతున్న రోజులో ఆరు సార్ల కంటే ఎక్కువ మూత్ర విసర్జన చేస్తున్న వయసుకు తగ్గట్టు బరువు పెరుగుతున్న పాలు సరిపోయినట్లు లెక్క. తల్లి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకొని, అన్ని రకాల పోషకాలు అందేలా మంచి బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా నువ్వులు, వెల్లుల్లి, పాలు కోడిగుడ్డు, కొబ్బరి కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. బిడ్డకు ఇంకా పాలు సరిపోకపోతే డాక్టర్ సలహా తీసుకోవాలి.

Leave a comment