Categories
WhatsApp

సరైన ఫిట్నెస్ తో వుండాలంటే.

ఫిట్ నెస్ కు కొన్ని ప్రధాన సూత్రాలు పాటించాలి. వ్యాయామాలు డైట్ విషయంలో శ్రద్ధ చూపిస్తూ కూడా కొన్ని జాగ్రత్తలు తప్పవు. వారంలో ఐడు రోజులు ౩౦, 40 నిమిషాల పాటు ఎక్సర్ సైజులు చేయాలి. ఆరోగ్యంగా వుంటేనో అలసటగా వుంటేనో తప్పా మాన కూడదు. రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి. టీవి, మొబైల్, కంప్యుటర్లు, నిద్రకు ఉపక్రమించే ముందర వాడకూడదు. మానసిక వత్తిడి లేకుండా ప్రశాంతంగా వుండాలి. ఘాడంగా నిద్ర పడితే కొవ్వు కరిగే వీలు చిక్కుతుంది. టోర్నీ అవుట్ కండరాల్లకు మరమ్మత్తులు చేసినా , ప్రయోజనాలు సరిగ్గా వుండాలంటే వ్యాయామాలు సక్రమంగా చేయాలి. రన్నింగ్, వాకింగ్, జాగింగ్, జిమ్ అంటూ రోజుకు ఒక్కటి కాకుండా ఎదో ఒక్కటి క్రమం తప్పక చేయాలి. క్రమ శిక్షణ పాటించాలి. ఇది శరీరాంకి కూడా అలవాటు చేయాలి. ఉదయం నిద్ర లేచే వేళలు, భోజనం, విశ్రాంతి ఇవీ ఒక సమయం అంటూ ఫిక్స్ చేయాలి. క్రమశిక్షణ జీవితానికి ఉపయోగ పడుతుంది.

Leave a comment