చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు స్క్రబ్ వాడకం మంచిదే గానీ జాగ్రత్తలు పాటించకపోతే సరైన ఫలితం రాదంటున్నారు ఎక్సపర్ట్స్. ముఖం పొడిగా ఉంటే స్క్రబ్ వాడటం నలుగు పెట్టుకోవటం చేస్తే చర్మం రాపిడికి లోనవుతోంది. ముఖం కాస్త తడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మృతకణాలు తొలగించాక చర్మం తేమగా ఆరోగ్యంగా ఉంటుంది. పొడి చర్మ తత్వం ఉంటే స్క్రబ్ లు వాడకపోవటం మేలు ముఖం బలంగా రుద్ద కూడదు. ముని వేళ్ళతో సవ్య అవసవ్య దిశలో మర్దన చేస్తున్నట్లు రుద్దాలి. స్క్రబ్ చేశాక స్క్రబ్ తో నీళ్లతో కడిగేసి మెత్తటి పొడి టవల్ తో ముఖం తుడుచుకోవాలి. నాణ్యమైన మాయిశ్చ రైజర్ వాడాలి అప్పుడే చర్మం ఉపశమనం పొందుతుంది తేమతో ఆరోగ్యంగా కనిపిస్తుంది.

Leave a comment