సాధారణంగా అందరికీ ముహుర్తాలు ,మంచి ఘడియలపైన నమ్మకం ఉంటుంది. ఇవి ఛాందస్తంగా అనుకొనే మాటలు కావనీ ,ముహుర్తం అన్న పదం వదిలేస్తే కొన్ని సమయాలు కీలక నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుగా ఉంటాయని ఒక అధ్యయనం చెపుతుంది. ఉదహరణకు మధ్యాహ్నం, పగలు 11.59 నిమిషాల సమయంలో మెదడు శరీరం చాలా చురుగ్గా ఉంటుంది. అప్పుడు తీసుకొనే నిర్ణయాలు చాలా మంచి ఫలితాల ఇస్తాయి. ఇక రాత్రి  10 గంటల తర్వాత తీసుకొనే నిర్ణయాలు ఆచరణ సాధ్యంగా ఉండవంటున్నారు. శరీరం,మనసు అలసి ఉన్నా సమయంలో ప్రపంచం నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో నిర్ణయాలు తీసుకొనేంత తాజా ఆలోచనలతో ఉండదని పరిశోధన ఫలితం చెపుతోంది. మన ముహుర్తాలు, శుభఘడియలు బహుశ ఇలాంటి మూలాల నుంచే వచ్చాయి కాబోలు.

Leave a comment