నీహారికా ,

కష్టంపంచుకొంటే పోతుంది అంటారు .మనసులో గూడు కట్టుకొన్న వేదన సమస్య ఇతరులతో షేర్ చేస్తే సగం భారం తగ్గిపోతుందంటారు ఎంతోమందికి ఉండే అభిప్రాయం .కానీ కొందరితో పంచుకొంటే ఊహాగానాలు , వేదన మరింత పెరుగుతాయి .మరి ఎవరితో పంచుకోవాలి అంటే మనమంటే ప్రాణం ఇచ్చే ప్రేమించే ఆత్మీయులుతో ఎవరన్నా చెప్పుకోవచ్చు .మన మేలు కోరే వారు చిన్న పరిస్కారం చూపిస్తారు . వేదన పోయేలా మంచి మాటలు చెబుతారు .కానీ ఎవరికీ పడితే వాళ్ళతో షేర్ చేస్తే అది ఇంకా పదిమందికి చేరి మనసుకి మరింత కష్టం కలిగిస్తుంది తప్ప లాభం ఉండదు .ఊరికే కాలక్షేపం కోసం మన దగ్గర చేరేవారిని ముందే గుర్తించి మనకు మేలు చేసే స్నేహితులను సంపాదించుకొంటే కోట్ల డబ్బు మన దగ్గర ఉన్నట్లే .వాళ్ళ విలువ అంతే మరి .

Leave a comment