ఎండల్లోనే మామిడి పండ్లు వచ్చినట్లు ఈ మండే ఎండల్లో పిల్లలకి సెలవులు దోరికి, ఏదైన లాంగ్ ట్రిప్ పోయో అవకాశం వస్తుంది. కాస్త దూర ప్రాంతం వెళ్ళాలంటే లగేజీ ఎలా తీసుకుపోవాలి అని భయం వేస్తుంది.పది రోజుల ట్రిప్ వేయాలంటే దుస్తులతోనే వచ్చింది. మాసిన దుస్తులు ఎప్పటిలా ఇస్త్రీ బట్టల్లా అణిగి ఉండవు అలాంటప్పుడు ట్రావేల్ స్పేస్ సేవర్ బ్యాగ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ బ్యాగ్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో గాలి ఉండదు. బట్టలు చక్కగా సర్ధుకొంటాయి. బోలెడన్ని బట్టలు తేలిగ్గా సర్దేసుకొవచ్చు. ఇవి స్మాల్, మీడియం ,లార్జ్, ఎక్స్ ట్రా లార్జ్ సైజుల్లో దోరుకుతాయి.

Leave a comment