సముద్రంలో ఉండి మొసళ్ళతో పోరాడటం ఎంత కష్టమో ఈ రంగంలో ఉన్న వేధింపుల గురించి మాట్లాడటం అంతే కష్టం అంటోంది హీరోయిన్ సనాఖాన్. నోరు జారి వివాదాల్లో ఇరుక్కొవటం ఎందుకు? కెరీర్ పాడు చేసుకోవటం ఎందుకు అన్న ఉద్దేశ్యంతోనే ఎక్కువ మంది లైంగిక వేధింపుల గురించి మాట్లాడరు. హీరోయిన్లను లేదా ఆర్టిస్టులను గౌరవంతో చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సంఖ్యపరంగా తక్కువ మంది. నాకు వేధింపులు తప్పలేదు. అవకాశాల కోసం కో ఆర్డినేటర్స్ ని కలవాలి. ఈ రంగంలో పని చేయాలంటే కలివిడిగా, ఓపెన్ గా ఉంటే అవకాశాలు వస్తాయి అంటారు. అంటే కాస్త కాంప్రమైజ్ అవ్వాలని అంటారు. అలా సర్ధుకు పోకపోవడం వల్లనే నాకు చాలా అవకాశాలు పోయాయి అంటుంది సనాఖాన్. సినీ బ్యాగ్ గ్రౌండ్ ఉన్న వారికి ఈ వేధింపులు కాస్త తక్కువ ఉంటాయి అంటోంది సనా. మొత్తానికి సమస్య ప్రపంచ వేదిక ఎక్కేసింది.

Leave a comment