ఏ పనికి చీరె అడ్డంకి కాదు ముఖ్యంగా యోగా చేసేందుకు అంటుంది పుణేకు చెందిన ఆయుర్వేద వైద్యురాలు శార్వరి ఈ 37 సంవత్సరాల ఫిట్నెస్ ఫ్రీక్ రోజు జిమ్ లో వెయిట్ ట్రైనింగ్, పుషప్స్ వంటి వర్క్ వుట్స్ చేస్తుంది. నా దగ్గరకు ఆరోగ్య సలహా కోసం వచ్చే ఎంతోమందికి నేను వ్యాయామం గురించి చెబుతాను ఎంత చెప్పినా సాంప్రదాయ చీరకట్టుతో వ్యాయామం కష్టం అంటారు. పోనీ జిమ్ డ్రెస్ వేసుకోండి అంటే అలవాటు లేదంటారు .సాంప్రదాయ ఆహార పద్ధతులు వదలరు మంచి పోషకాహారం తీసుకోరు వాళ్లకోసం నేను చిన్న ప్రయోగం చేశాను అంటుంది  శార్వరి.  ఆమె చేసిన వినూత్న ప్రయోగం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. చీరకట్టుతో వర్క్ వుట్స్ చేసి ఆ వీడియో లు పోస్ట్ చేసింది శార్వరీ. వ్యాయామం చేసేందుకు ఏమాత్రం అడ్డంకి కాదు కానీ నిరూపించి చూపెట్టింది శార్వరి. ఆరోగ్యం కోసం ఫిట్ నెస్ తో వుండాలి ఏ డ్రెస్ అయినా వ్యాయామానికి అడ్డం కాదు అంటుంది శార్వరి. చీరకట్టుతో ఆమె చేసిన వర్క్ వుట్స్ చాలా ఈజీగా అసలు చీరే వ్యాయామానికి అనుకూలం అనిపించేలా ఉంది .

Leave a comment