సాంప్రదాయ వేడుకలకు చీరెలే అందం.ఇక చీరకట్టులో ఎన్నెన్నో మార్పులు. ఒకే రంగు ప్రింట్ కాంబినేషన్ తో జత చేసిన పైట కొంగుతో ఫ్యాంట్ శారీ చాలా ప్రత్యేకం. దోతి శారీ లాగా ఇవి, కాటన్ సిల్క్ ఇతర ప్యాటర్న్ లలోనూ బావున్నాయి. రెండు భిన్నమైన రంగుల చీరెలను, లాంగ్ ఓణీ స్టైల్ లో కట్టుకునే చీర కట్టు సాంప్రదాయ వేడుకల్లో హైలైట్. ఇక సింపుల్ గా డ్రెస్ గా కనిపించే దోతీ శారీ డ్రెస్ లాగానూ, ఇటు చీరెకట్టు లాగానూ వంద మార్కులు కొట్టేసింది. కలంకారీ పెప్లమ్ బ్లౌజ్, ప్లెయిన్ శారీ కాంబినేషన్ ఇవ్వాల్టి అమ్మాయిల ఛాయిస్ గా ఉంది. శారీ విత్ దుపట్టా స్టైల్ లో కంచిపట్టు చీరె సరిపోయే భారీ దుపట్టా తో భుజాలకు రెండువైపులా పైట వేసుకుంటే అచ్చం యువరాణి రూపం వచ్చేస్తోంది. వేడుకల్లో ఇండో వెస్ట్రన్ స్టైల్ తో అమ్మాయిలు మెరిసిపోతున్నారు.

Leave a comment