అందమైన గద్వాల చీరె పుట్టిన ఊరు జోగులాంబ గద్వాల్ జిల్లానే.అత్యంత పలుచగా అతి తేలికగా ఉండే చీరెలు నేయగలరు ఇక్కడి కళాకారులు. నూలు పట్టు పోగుల నుంచి దారాన్ని తీసి రంగులు అద్ది అందమైన చీరెలు తయారు చేస్తారు.నేత చీరె కు పట్టు అంచు జోడించటం ఇక్కడి ప్రత్యేకత.చక్కని హంసల బార్డర్ లు పువ్వుల అంచులతో ఈ చీరెలు చాలా సాంప్రదాయమైనవి.చేనేత సౌందర్యాన్ని ప్రతిఫలించే ఈ చీరె లకు 2010లో భూగోళిక
గుర్తింపు లభించింది.ఇప్పటికీ ,తిరుపతి వెంకటేశ్వరుడికి ప్రతిఏటా పట్టు పంచలు పంపటం ఇక్కడి సాంప్రదాయం.తేలికైన రంగులు చక్కని జరీ అంచు,భారీ హంగులతో గద్వాల్ చీరె పండుగ కళ ని తీసుకు వస్తుంది.

Leave a comment