సంగీతం ఎందుకు ఆనందపెడుతోంది. పశువులూ శిశువులూ  కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయంటారు ఎందుకూ ? అంటే సమాధానం దొరికింది. సరిగామలతో  ఆహ్లాద పరిచే భారతీయ సంగీతమైనా కోరేమీ అంటూ సాగే పాశ్చాత్య సంగీతమైనా వినగానే మెదడు లోని డోపమైనను ఈ ధ్వనులు నియంత్రించటం వల్ల సంతోషం కలుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కొంతమందికి మనసుకు నచ్చిన సంగీతంతో తమ కోపాల్ని భావోద్వేగాలను నియంత్రించుకోగలగటం చిరాగ్గా ఉన్నా సరే సంగీత ధ్వనులు కంతులేని ఆహ్లాదం ఇస్తాయిట. డోప్ మైన్ సంబంధించిన  మానసిక సమస్య తో బాధపడేవారికి సంగీతం దివ్యౌషధంలా పనిచేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. అంతేకాదు మానసిక వత్తిడికి గురైనా ఆందోళన కలిగినా సంగీతం వినటం ద్వారా ఉపశమనం పొందవచ్చునన్నారు.

Leave a comment