అమ్మాయిలకు ఇష్టంగా కంఫర్ట్ గా ,ఏ సందర్భంలోనైన వేసుకొనే వీలుగా ఉండేవి జీన్స్. అయితే శరీరాకృతిని బట్టి జీన్స్ ఎంచుకొమంటారు స్టైలిస్టులు. సన్నగా ఉండి ,కాళ్ళు పొడవుడా ఉండే వాళ్ళకి స్లిమ్ ఫిట్ జీన్స్ బావుంటాయి. వీటికి పొడవైన జాకెట్స్ మ్యాచింగ్ షూ జతగా ఉండాలి.అలాగే శరీరం ఫిట్ గా ఉంటే రెగ్యూలర్ క్యాజువల్ జీన్స్ చక్కగా సరిపోతాయి. ఇవి ఆఫీస్ వేర్ గా కూడా బావుంటాయి. ఇక ఎక్సర్ సైజ్ బాడీ అయిల్ ఫిటైడ్ జీన్స్ వేసుకొంటే మంచి లుక్ వస్తుంది. ఇక ఏ శరీరాకృతి ఉన్న క్లాసిక్ ఫిట్ జీన్స్ వేసుకుంటే కంఫర్టుగా ఉంటాయి. కాళ్ళ కింద భాగంలో కాస్త వదులుగా ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైన పనిలో మునిగి ఉన్న ఈ జీన్స్ శరీరానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Leave a comment