జైపూర్ లోని పింక్ సిటీ రిక్షా సంస్థ పర్యాటలకు కోసం నడిపే ఇ-రిక్షాలలో మహిళలకు ఉపాధి చూపించింది.ఒక స్వచ్చంద సంస్థ సాయంతో మహిళలను గుర్తించి ,డ్రైవింగ్ లో శిక్షణ ఇప్పించి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉచితంగా ఇప్పిస్తోంది..ఇప్పుటి వరకు 200 మంది మహిళలు శిక్షణ తీసుకొన్నారు. వీరిలో 50 మంది జైపూర్ లోని టూరిస్ట్ లకు చారిత్రక కట్టడాలు చూపిస్తున్నారు. ఈ పింక్ సిటీ సంస్థ రిక్షాలు టూరిజం ,కార్పోరేట్ పంక్షన్లు,పెళ్ళిళ్ళకు వాడుతున్నారు.ఈ రిక్షాలు చార్జింగ్ తో నడుస్తాయి. తనకుంటు ఒక ఉపాధి దొరకటంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెపుతున్నారు ఈ రిక్షా డ్రైవింగ్ శిక్షణ తీసుకొన్న మహిళలు

Leave a comment