Categories

మహిళలే ఎంతో జాగ్రత్తగా విమానాలు నడుపుతారనీ, రిస్క్ అవకాశాలు ఎన్నిసార్లు అంచనావేసి రంగంలోకి దిగుతారని అధ్యయనకారులు చెబుతున్నారు. మన దేశంలో మహిళా పైలెట్ల శాతం 12.4 ఏవియేషన్ రంగంలో ఇదో రికార్డ్ కూడా. మన దేశంలో మొదటి ఎయిర్ క్రాఫ్ట్ నడిపింది సరళా థక్రాల్. అదీ చీరకట్టుతో పెళ్లయిన తర్వాత 21 ఏళ్ల వయసులో పైలెట్ లైసెన్స్ సాధించారు. వెయ్యి గంటలపాటు విమానం నడిపే ‘ఎ ‘ లైసెన్స్ పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచారు సరళా టకరాల్. తొలి భారత మహిళ మెయిల్ పైలెట్ కూడా.