ఉత్తరాఖండ్ లోని సత్ పాంత్ గ్లేషియర్ ని సత్యమార్గం అంటారు.పురాణ ఇతిహాసాలు నమ్మే వాళ్ళు ఇది సత్యానికి రహదారి మహభారతంలో పాండవులు స్వర్గాన్ని చేరేందుకు ఈ దారినే నడిచివెళ్ళారంటారు.ఇక్కడ నుంచి చౌకంబ పేరుతో ఉన్న మంచు సరస్సు బద్రీనాథ్ పర్వతశిఖరాలు నుంచి ఏడువేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. నాల్గువేల మీటర్ల ఎత్తులో నీటిలో కరిగి కిందకి దూకే జలపాతంలో నీరు పాపం చేసిన వాళ్ళ నెత్తిన పడదని ఒక విశ్వాసం. ఈ బౌకంబ జలపాతం అందాలు,సత్ పాంత్ కు చేరే రాళ్ల దారి చుట్టు పర్వతాలు మేఘాల మధ్య నడక ఒక అద్భుత యాత్ర.ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన రోజున ఇక్కడికి బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు వస్తారని ఒక బలమైన నమ్మకం.

 

Leave a comment