చారులత బెంగాలీ సినిమా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రం 1901 నేపథ్యంలో జరిగిన కథ. సినిమా తీయాలను కొన్నవాళ్ళు ఒక స్టోరీ కోసం ఈ చారులత ను చూడాలంటారు. చారులత,భూపతి బెంగాలీ ధనిక వర్గానికి చెందిన దంపతులు భూపతి ఒక రాజకీయ పత్రిక నడుపుతాడు. చారులతను భూపతి ఎంతగానో ప్రేమించి గౌరవించినా ఆమెను పెద్దగా అర్ధం చేసుకోడు. భూపతి తమ్ముడు అమల్ చదువు పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. ఇతను గాయకుడు,కథలు రాస్తాడు. అమల్ చారులత భావాలు ఒక్కటే. అమల్ పైన ప్రేమ పెంచుకొంటుంది. ఒకానొక సందర్భంలో తనను మోసం చేసి డబ్బుతో పారిపోయిన బావమరిది గురించి భూపతి తాను మోసపోవటం వల్ల ఎక్కువ బాధపడ్డ నంటాడు. మోసపోవటం కంటే దారుణం లేదంటాడు. అన్న ను అర్ధం చేసుకొని బాధతో అమల్ ఇల్లు వదిలి వెళ్ళి పోతాడు. చారులత భర్త పడుతున్న బాధను చూసి అతన్ని మోసం చేయకూడదని అనుకొంటుంది. భార్య భర్తల బంధానికి బలమైన పునాది ఏమిటన్నది చర్చిస్తుంది ఈ సినిమా తప్పకుండ చూడవలసిన చిత్రం.

Leave a comment