ఈ మధ్య కాలంలో జరుగుతున్న హెల్త్ పరమైన రీసెర్చ్ లు ఎన్నో అద్భుతమైన అంశాలను కానుకొని తెచ్చి ఇస్తున్నాయని నిపుణులు చెపుతున్నారు. జీవన శైలిలో వస్తున్న ఆందోళన,వత్తిడి వంటి మానసిక సమస్యలకు మందులు వాడనవసరం లేకుండా కేవలం ఆహారం తోనే చెక్ పెట్టవచ్చు అంటున్నారు. ఈ లక్ష్యం తో జరిగిన ఒక అధ్యయనంలో కొంత మందిని రోజుకు పది సార్లు పండ్లు,మూడు సార్లు ప్రోటీన్ ఫుడ్ ,మూడు సార్లు పెరుగు లేదా పాలు మూడు టేబుల్ స్పూన్ నట్స్ ,ఒక స్పూన్ పసుపు ఆహారంగా ఇచ్చారు. తీపి ,కొవ్వు రెడీమేడ్ ఫుడ్,ఇతర పానీయాలు నిషేదించారు. రెండు మూడు నెలల్లోనే ఈ ఒత్తిడి ఆందోళన తగ్గుముహం పట్టినట్లు గమనించారు.

Leave a comment