మూడో నెల రాగానే గర్భవతికి వేవిళ్ళు తప్పవు.ఏవి తిన్న వికారం ,వాంతులు. ఆహారపు పద్దతి మార్చుకొంటే ఈ సమస్య అదుపులో ఉంచుకోవచ్చు అంటారు ఎక్స్ పర్ట్స్. ఆహారం కాస్త చప్పగా ఉండాలి. మాంసకృత్తులు అధికంగా ఉండాలి.పాలు ,తాజా పెరుగు ,ఉడికించిన గుడ్డులోని తెల్లసోన ,బాధం పప్పులు మంచివి. ఘనాహారం ద్రవహారం తీసుకొవాలి. మసాలా తగ్గించి తీరాలి. సాధరణ ఉష్టోగ్రతలో ఉన్న సాత్వికమైన భోజనం చేయాలి.కొబ్బరి నీళ్ళు ఉప్పు వేసిన మజ్జిగ తీసుకొంటూ ఉండాలి. ఆకు కూరలు ,పప్పు మంచివి తియ్యని చిరుతిండ్లతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

Leave a comment