ఒక్క సంక్రాంతే కళకళలాడుతూ కళ్ళకు కనిపించే పండుగా. ప్రతి ఇంటి ముంగిలో రంగవల్లులూ పండగను గుర్తు చేస్తూ ఉంటారు. ముగ్గు అంటే చుక్కలు ,మెలికలు గీతల ముగ్గులే. ఇప్పుడు యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక గొప్ప పెయింటింగ్లే ముగ్గులుగా ఎలా వేయవచ్చో వీడియోలు చేసి చెప్పేస్తున్నారు. ఇప్పుడోస్తున్న ముగ్గుల్ని పోస్టర్ రంగోలి సీనరీ రంగోలీ అంటున్నారు. ప్రకృతిలో మనకు కనిపంచే ప్రతి దృష్యాన్ని చక్కని రంగులతో నేలపైనే వేసేయటం అన్న మాట. చాక్ పీస్ తో సీనరీ గీసుకోని ముందే కలపిపెట్టుకున్న రంగుల ముగ్గులను చల్లుతూ కావాలిసిన దృష్యాన్ని నేలపైన సృష్టిస్తున్నారు.ఇవి ఎలా వేసుకోవాలో వీడియోల్లో చూడవచ్చు.

Leave a comment