వర్షాకాలంలో శరీరానికి మేలు కలిగించే పండ్లు చాలా వున్నాయి. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే లీచి, కివి, ఎండుద్రాక్ష, లాంటివి వర్షాకాలంలోనే దొరుకుతాయి. లీచీ పండ్లు డెహ్రాడూన్ ప్రాంతంలో బాగా పండుతాయి. ఇప్పుడు ప్రతి చోటా ఈ లీచీ పండ్లు దొరుకుతాయి. తొక్క తీయడం కాస్త కష్టమే కానీ పండు వల్ల చాలా మంచి ఫలితం వుంటుంది. చల్లగా వుండే వాతావరణంలో ఈ పండు తునడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దగ్గును రానీయదు. విటమిన్-సి, పుష్కలంగా వుంటుంది. వివిధ గ్రందులపైన సానుకూల ప్రభావం వుంటుంది. ఎక్కువ కాల్షియం పాస్పరస్, పోలేట్, పొటాషియం ఉంటాయి. ఇంకా రిబోఫ్లోవిన్, ఐరన్ లతో పాటు రక్తం లో కోలెస్ట్రోల్ లెవెల్స్ తగ్గించగల కరిగే స్వభావం వున్న ఫైబర్ ఎక్కువ వుంటుంది. లిచీ జ్యూస్ దొరుకుతుంది కానీ పండ్లు తినడమే ఆరోగ్యం.

Leave a comment