భారతీయ మహిళలు తాము ఇప్పుడు నడుపుతున్న వ్యాపారంలో రాణించడమే కాక ఇంకో ఐదేళ్ల నాటికి 90 శాతం వరకు అభివృద్ధి సాధించబోతున్నారు అని ఎడెల్ గివ్ విశ్లేషణల ఫలితం చెబుతోంది. ఈ సర్వేకు లాండ్ స్కేప్ స్టడీ ఆన్ ఉమెన్ ఆంట్రఫెన్యూర్ షిప్ అని పేరు పెట్టారు.  మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్య దర్శి రమా మోహన్ మిశ్రా ఈ సర్వే నివేదికలో విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలోను ఈ సర్వే జరిగింది. ఇందుకోసం ఎడెల్ గివ్ కి సంస్థ మూడు వేల మంది మహిళా వ్యాపారులను కలిసి మాట్లాడి, లాభాల్లో నడుస్తున్న వారి సంస్థల తీరు గురించి తెలుసుకుంది. అందులో వెయ్యి మందిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేసింది ఆ నివేదిక ఇండియాలో మూడు కోట్లకు చేరనున్న మహిళా వ్యాపారవేత్తలు భవిష్యత్తులో 15 నుంచి 17 కోట్ల మధ్య ఉద్యోగులు సృష్టించబోతున్నారు అని స్పష్టం చేసింది. మహిళల వల్లే ఇండియా సుభిక్షం సురక్షితంగా ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

Leave a comment