Categories
మనిషి దినచర్యలో ముఖ్యమైన అంశం స్నానం . రోజు,వేడి కాలుష్యం ఉన్న వాతావరణంలో ఉంటారు కనుక ప్రతి రోజు రెండుసార్లు విదిగా స్నానం చేస్తేనే ఆరోగ్యం. స్నానం అంటే వంటిపైన నీళ్ళు కుమ్మరించుకోవటం కాదు. శరీరాన్ని శుభ్రం చేసే స్నానం చేయాలి. స్నానం కోసం ఉపయోగించే నీరు మరీ వేడిగా లేదా చల్లగా ఉండకూడదు . చర్మం పైన ఉండే సెబేషియస్ గ్రంధులు ఉతేజితమై చర్మ రక్షణకు అవసరమైన నూనెలు సేవించేందుకు కావలసిన వేడిలో అంతే గోరువెచ్చగానే ఉండాలి ప్రతి రోజు స్క్రబ్ ఉపయోగించకూడదు. ఇంట్లోనే చేసిన పెసలు పిండితో వాళ్ళు తోముకోవాలి. వారానికోసారి నేనే రాసి మర్దన చేసి సున్నిపిండి తేలికైన సబ్బు ఉపయోగించి తలస్నానం చేయాలి. స్నానం తో సేద దీరి శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.