వేసవి ఎండకు శరీరం ఎంతో అలసిపోతుంది. వంట్లో నుంచి నీరు ఆవిరి అయిపోయి మొహం,జుట్టు కూడా కళ తప్పిపోతాయి. అలసట నుంచి సత్వరం తేరుకోవాలంటే కీరా తినమంటున్నారు ఎక్స్ పర్ట్స్. వీటిలో విటమిన్ బీ ఎక్కువగా ఉంటుంది. రోజంతా మధ్య మధ్యలో రెండు కీరా ముక్కలు తింటుంటే దాహం వేయదు. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది కీరా. జీర్ణ వ్యవస్థ బావుంటుంది. అధికబరువు సమస్య తలెత్తదు. జీర్ణక్రియకు అవసరం అయ్యే పీచు కీరదోసలో వుంటుంది కాబట్టి శరీరంలో మలినాలు శీఘ్రంగా బయటికి పోతూ ఉంటాయి. శరీరం డీహైడ్రేషన్ బారినపడే అవకాశమే రాదు.

Leave a comment