రాబోయే రక్షాబంధన్ పండుగ కోసం సీడ్ రాఖీలు తయారు చేస్తున్నారు చిప్లి  గ్రామ మహిళలు చత్తీస్గఢ్ దంతారి జిల్లాలోని చిప్లి  గ్రామంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కలిసి గోమయంతో సీడ్ రాఖీ లు తయారు చేసి మార్కెటింగ్ కి సిద్ధం చేస్తున్నారు.ఆవు పేడ ను, విత్తనాలు కలిపి పువ్వుల లాగ నక్షత్రాల లాగా వివిధ ఆకారాలతో అచ్చులు  తీసి ఎండబెట్టి రంగులు అద్ది మోటిఫ్ లు గుచ్చి అందమైన దారాలు సన్నటి రిబ్బన్లతో రాఖీలు చేస్తున్నారు. నేషనల్ రూరల్ లైవ్ లీ హుడ్ మిషన్, ఆర్య ప్రేరణ సమితి కలిసి స్వయం సహకార బృందాలకు ఈ రాఖీలు తయారు చేయటంలో శిక్షణ ఇచ్చారు. జిల్లా పంచాయితీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నమ్రత గాంధీ కూడా వీరికి సహకారం అందించారు పండగ అయ్యాక పొలాల్లోకి విసిరితే చాలు అందులో ఉంచిన విత్తనాలు మొక్కలయి పోతాయి .

Leave a comment