ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుర్ధం సినిమాల్లో నటిస్తున్న అనుపమా పరమేశ్వరన్, అ ఆ, శతమానం భవతి తర్వాత తన పాత్రను అభిమానులు బాగా గుర్తు ఉంచుకున్నారని చెప్పుతుంది. తెలుగు, మలయాళం, తమిళ సినిమాలలో నిమిషా కాళీ లేని అనుపమ, సినిమాల్లోకి రాకపోతే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ని అయ్యి వుండే దాన్ని అంటుంది. పుస్తకాలు పుస్తకాల బట్టి వచ్చ అలవాటు, ఏదైనా డిఫరెంట్ కెరీర్ గురించి అలోచించినపుడు అడవులు, జంతువులే నాకు గుర్తొచ్చాయికానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేసాను. ప్రేమమ్ మళయాళ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతూ వుంటే బోలెడన్ని సేల్ఫీలు పంపేసాను. అవి నచ్చి నన్ను ప్రేమమ్ కు ఎంపిక చేసారు. అయితే అలా సేల్ఫీ కుడా గొప్ప ఫ్యాషనబుల్ సేల్ఫీలు కావునేనెలా వున్నానో అలాతివే. సినిమాల్లో తప్పించి నేను బయట అతి మాములుగా జీన్స్, టీషర్ట్స్, టాప్లే వేసుకుంటాను మంచి మంచి వస్తువులు కుడా షాపింగ్ చేసే అలవాటే లేదంటుంది అనుపమ పరమేశ్వరన్.

Leave a comment