కాస్సేపు మొక్కల్లో పనిచేస్తే మన రూపాన్ని మనం ప్రేమించుకొని గుణం పెరుగుతుందంటున్నారు పరిశోధకులు .తోటపని లో మొక్కల పెరుగుదల అదేపనిగా గమనించటం వల్ల ఎవరి శరీరం పట్ల వారికీ ఒక ఆత్మ విశ్వాసం కలుగుతోందని చెపుతున్నారు .మంది ఉద్యానవన ప్రేమికులతో చేసిన ఒక విశ్లేషణ లో వాళ్ళలో రూపం విషయం లో ఎలాటి పిర్యాదులు అందలేదట .ప్రకృతి కి దగ్గరగా ఉండేవాళ్ళు చుట్టూ చెట్లను,  పుట్టలను  ప్రేమించినట్లే తమను తాము అంతే ప్రేమించుకొంటారట .నగర జీవితంలో ఉండేవాళ్ళు ఏ కొద్దీ స్థలంలో అయినా కాసిని మొక్కలు వేసుకొంటే శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఉంటుందని చెపుతున్నారు పరిశోధకులు .

Leave a comment