సెల్ఫీలు తీసుకోవటం జీవితంలో ఒక భాగం అయిపొయింది. స్నేహితులతో కొత్త ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకోవటం ఫెస్ బుక్ లో వెంటనే అప్లోడ్ చేయటం అమ్మాయిలకు సరదా. ఇప్పుడు ఫోటో చక్కగా రావాలంటే మొహం పైనే కాదు వేసుకున్న దుస్తులపైనా కూడా వెలుగుచేరి కొత్త అందం తీసుకువస్తాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు సమయంలో సెల్ఫీలు నీరసంగా కనిపిస్తాయి. ఉదయం సాయంత్రం ఫ్రెష్ లుక్ తో ఉన్నప్పుడే ఫోటో కళ్ళు అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఫోటో తీసుకోవాలనుకున్నప్పుడు కళ్ళ పై దృష్టి  పెట్టాలి. కాను బొమ్మల్ని దిద్దుకుని మస్కారా వేసుకుని లేత ఛాయలో ఐషాడో అద్దుకుని  అప్పుడు ఫోటో తీసుకుంటే కళ్ళ అందం ముఖాన్ని వెలిగించేస్తుంది. వేసుకునే దుస్తులు నగలు ఫొటోలపై ప్రభావం చూపిస్తాయి. మెడ  పొడుగ్గా చక్కగా కనిపించాలంటే వి ఆకారంలో మెడ ఉన్న దుస్తుల్ని ఎంచుకోవాలి. మరీ పెద్ద జుంకీలు భారీ నగలు లేకుండా ఉండాలి. మొహం వేసుకున్న దుస్తులు బాగా కనిపంచాలంటే కెమెరా ఎత్తుగా ఉండాలి. అదే నిలబడితే సెల్ ఫోన్ సమానమైన ఎత్తులోనే ఉండాలి.

Leave a comment