ఇది సెల్ఫీల యుగం. ప్రతి నిమిషం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వాళ్లు ,సెల్ఫీలు పోస్ట్ చేస్తూనే ఉంటారు. చివరకు షాపింగ్ కు వెళ్ళినా దాన్నీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారు. ఒక సెల్ఫీ పెట్టేస్తారు. ఇలాంటి సరదానే ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీస్తుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖంలో ఎటువైపు నుంచి ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారో , ఆ వైపున ఉండే చర్మం ముడతలు పడుతోంది చూసుకోండి అంటున్నారు. ఫోన్ నుంచి వెలువడే కాంతి, రేడియేషన్ చర్మ ఆరోగ్యన్ని పాడు చేస్తాయంటున్నారు. దీని కారణం చేతనే డిఎన్ఎ దెబ్బతింటుందంటున్నారు. సెల్ఫీలు కాస్త తగ్గిస్తేనే మంచి దంటున్నారు.

Leave a comment