జీవితంలో ప్రతి నిముషం ఆస్వాదించ దగ్గదే . దానికి వయసుతో పనిలేదు మనసుండాలి . జపాన్ కు చెందిన కిమికో నిషిమొటో అనే 90 ఏళ్ళ ముసలమ్మ గారికి సెల్ఫీలు తీసుకోవటం సరదా . 72 ఏళ్ళు వచ్చాక కెమెరా కొనుక్కొని ఫొటోగ్రఫీ నేర్చుకొంది . ఈవిడ హాస్యం తో కూడిన ఫోటో షూట్స్ చేస్తుంది . గొలుసుతో కట్టి పడేసిన కుక్కలాగా,కప్పలు కుందేళ్ళు వంటి జంతువుల వేషాలు,తనంతట తానే బట్టలు ఆరేసినట్లు హేంగర్ కి వేలాడటం ఒకటేమిటి 90 ఏళ్ళ వయసులో చేయలేని విన్యాసాలు అన్ని చేస్తుంది ఈమెను 45 వేల మంది ఫాలో అవుతున్నారు . ఈమె సెల్ఫీలు అన్ని నవ్వొచ్చేవే .

Leave a comment