అందాల పోటిలో గెలిచి మోడలింగ్ లో అడుగుపెట్టి సినిమా వైపు నడిచిన కత్రినాకైఫ్ బాలీవుడ్ టాప్ యాక్టర్స్ లో ఒకరుగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడామే ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్. ఎఫ్ హెచ్ ఎమ్ కత్రినాను ఐదు సార్లు ప్రపంచ శృంగార తారగా గుర్తించింది. ఈస్టర్న్ ఐ సెక్సియస్ట్ ఏషీయన్ ఉమెన్ గా అనేక సార్లు ఆమెను పేర్కోంది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆమెను ఆకాశానికి ఎత్తింది. లండన్ లోని మెడమ్ టుస్సాడ్స్ లో మైనపు బొమ్మగా నిలబడ్డ ఎనిమిదో యాక్టర్ కత్రినా. ఆమె కెరీర్ క్రెడిట్ లో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. ఇంత సాధించిన అనుకున్నది సాధించాకా తర్వాత జీవితాన్ని సిరీయస్ గా తీసుకోకూడదు. పాజిటివ్ గా వ్యవహరించాలి. నిజాయితీగా ఉంటే కోరినవి దక్కుతాయి అంటుంది కత్రీనా కైఫ్.

Leave a comment